త్వరలో ప్రతి భక్తునికి 100 గ్రాముల లడ్డూ ఉచితం | 100 grams free laddu for every piligrim very soon, says ttd | Sakshi
Sakshi News home page

త్వరలో ప్రతి భక్తునికి 100 గ్రాముల లడ్డూ ఉచితం

Aug 24 2015 5:04 PM | Updated on Sep 3 2017 8:03 AM

త్వరలో ప్రతీ భక్తునికి వంద గ్రాముల లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం నాటి టీటీడీ పాలక మండలి సమావేశంలోపలు అంశాలపై చర్చించారు.

తిరుమల:త్వరలో ప్రతీ భక్తునికి వంద గ్రాముల లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.  సోమవారం నాటి టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం వద్ద రూ.4 కోట్లతో విశ్రాంతి భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు రెండు లక్షల కేజీల ఎండు ద్రాక్ష కొనుగోలుకు రూ. 3.50 కోట్లు, ఆరు నెలల సరిపడా కందిపప్పు కొనుగోలుకు రూ.4.13 కోట్లు, ఆరు నెలల సరిపడా ఆవు నెయ్యి కొనుగోలుకు రూ. 46.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

 

సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు, వెయ్యి కాళ్ల మండపం నిర్మాణానికి ప్లాన్ ను పరిశీలిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement