పిట్స్‌ బాధతో యువకుడి ఆత్మహత్య | Young Man Suicide | Sakshi
Sakshi News home page

పల్లిమక్తలో యువకుడి ఆత్మహత్య

Apr 4 2018 12:24 PM | Updated on Nov 6 2018 8:16 PM

Young Man Suicide - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

కోనరావుపేట(వేములవాడ) : కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన యాదరవేణి మల్లేశం(33) కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. రెండేళ్ల నుంచి పిట్స్‌తో బాధ పడుతున్నాడు. దీంతో మంగళవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదుతో ఎస్సై రమేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement