పిల్లలు కలగలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం | Young Man Commits Suicide For Children in Prakasam | Sakshi
Sakshi News home page

పిల్లలు కలగలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

Dec 5 2019 12:50 PM | Updated on Dec 5 2019 12:50 PM

Young Man Commits Suicide For Children in Prakasam - Sakshi

ఒంగోలు,అద్దంకి రూరల్‌: పిల్లలు కలగలేదని మనస్తాపం చెందిన యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. క్షతగాత్రుడి బంధువుల కథనం ప్రకారం.. దర్శి మండలం నూజిళ్లకు చెందిన నున్నా వెంకట నారాయణకు చిలకలూరిపేటకు చెందిన త్రివేణితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అక్కడ పనులు లేక పోవడంతో అద్దంకి వచ్చి ఏడాది నుంచి ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకటనారాయణకు పిల్లలు కలగక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఇంట్లో మంటలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే మంటలార్పేవేశారు. 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి అద్దంకి వైద్యశాలకు తరలించారు. శరీరం సగభాగం కాలి పోవడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement