మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. షాకిచ్చిన ఆవిడ | Woman Leaves With Third Man After Her Two Husbands Fight on Highway | Sakshi
Sakshi News home page

Aug 7 2018 3:08 PM | Updated on Sep 28 2018 4:32 PM

Woman Leaves With Third Man After Her Two Husbands Fight on Highway - Sakshi

ఆ ఇద్దరు తనకొద్దు అంటూ.. మరొకరిని పెళ్లి చేసుకున్నానని తెలిపి వారికి షాకిచ్చింది ఆ మహిళ.

బెంగళూరు : ఆవిడ మా ఆవిడ అంటూ ఒకరు.. కాదు మా ఆవిడ అంటూ మరొకరు. ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన గత శనివారం బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు తనకొద్దు అంటూ.. మరొకరిని పెళ్లి చేసుకున్నానని తెలిపి వారికి షాకిచ్చింది ఆ మహిళ. వారిద్దరూ స్నేహితులేనని, తమతో సంబంధం పెట్టుకున్న యువతి కోసం తన్నుకున్నారని తేల్చిన పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సదరు మహిళను పిలిపించి మాట్లాడగా.. ఆ ఇద్దరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, తను వారితో సహజీవనం మాత్రమే చేశానని, మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నానని షాకిచ్చింది. అంతేకాకుండా సదరు మహిళకు అప్పటికే మూడు పెళ్లిళ్లు కావడం కొసమెరుపు.

తొలుత రంగస్వామి అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె కొన్నాళ్లు సంసారం చేసి అనంతరం అతన్నుంచి విడిపోయింది. తర్వాత ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్‌ కుమార్‌తో సహజీవనం చేసింది. అనంతరం మూర్తి అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌తో సహజీవనం సాగించింది. ఇది తెలిసిన రమేష్‌ ఆమెకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో పరిచయమైన సిద్దరాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ పెళ్లి చేసుకుందామని ఆమెకు చెప్పాడు. అతనితో కూడా సహజీవనం ప్రారంభించిన ఆమె, గత శనివారం సిద్దరాజుతో కలిసి ఉండటాన్ని మూర్తి చూశాడు. ఆగ్రహంతో సిద్దరాజుపై దాడి చేశాడు. ఇద్దరు గంటపాటు చితక్కొట్టుకున్నారు. ఇప్పుడా ఆ మహిళ ఇద్దరికీ హ్యాండిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.

చదవండి: మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. నడి రోడ్డుపై రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement