మా ఆవిడ.. కాదు మా ఆవిడ

Two Men Fight for One Woman in Chikkabidarakallu - Sakshi

దొడ్డబళ్లాపురం: ఆవిడ మా ఆవిడ అంటూ ఒకరు.. కాదు మా ఆవిడ అంటూ మరొకరు. ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుకు ఎక్కారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకుని నానా రచ్చ చేశారు. నెలమంగల తాలూకా బావికెరె క్రాస్‌ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చిక్కబిదరకల్లు నివాసి మూర్తి, సిద్ధు అనే వ్యక్తులు ఒక మహిళను ఎవరికి వారే నా భార్య అంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు కొట్టుకోవటంతో హైడ్రామా నడిచింది. జనం గుంపులుగా చేరి మరీ గొడవను వీక్షించారు.  

ఒక్కరూ విడిపించే ప్రయత్నం చేయకపోగా.. వీడియో తీశారు కూడా. కొన్ని గంటల్లోనే వీడియోలు సోషల్‌ మీడియాలో రావడంతో టీవీ చానళ్లలో ఈ గొడవ వైరల్‌గా మారింది.  ఇంతకీ అసలు విషయం ఏంటంటే... సదరు మహిళకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నారు. కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులూ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై స్థానిక పోలీసులు వాళ్ల మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

                                         Courtesy: Btv Kannada

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top