ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి | van falls off bridge in Maharashtra, Seven Killed | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

Nov 30 2019 10:33 AM | Updated on Nov 30 2019 10:47 AM

van falls off bridge in Maharashtra, Seven Killed - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ధులే జిల్లా వించూర్‌ సమీపంలో అర్థరాత్రి సమయంలో ఓ వ్యాన్‌ అదుపు తప్పి వంతెన పైనుంచి లోయలో పడింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు సంఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement