
సాక్షి, నిజమాబాద్: ఆటో బావిలో పడి 11 మంది దుర్మరణం చెందిన ఘటనను మరువకముందే నిజామాబాద్‌లో మరో ఆటో ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి పడిపోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అతి వేగమే ఆటో బోల్తాకు కారణమని స్థానికులు అంటున్నారు. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు చెందిన సువర్ణ, మామిడిపల్లికి చెందిన వెంకట్ స్వామి ఉన్నారు.