పసిపిల్లపై అత్యాచారయత్నం | Toddler Molested In Prakasam | Sakshi
Sakshi News home page

పసిపిల్లపై అత్యాచారయత్నం

Jul 20 2018 11:15 AM | Updated on Jul 23 2018 8:51 PM

Toddler Molested In Prakasam - Sakshi

అర్ధవీడు (ప్రకాశం): అభంశుభం తెలియని పసిపిల్లను అత్యాచారం చేయబోయిన ఓ కామాంధుడికి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన  మండల కేంద్రమైన అర్ధవీడులో బుధవారం రాత్రి చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు స్థానిక అహ్మద్‌నగర్‌కు చెందిన షేక్‌ గులాంరసూల్‌ పూటుగా మద్యం సేవించి తన ఇంటి పక్కన ఉన్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని వాము దొడ్డిదగ్గరకు తీసుకుపోయి అత్యాచారయత్నం చేయడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది.

దీంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఏమైంది ప్రశ్నించగా.. ఏడుస్తూ విషయం తెలిపింది. స్థానికులు గులాంరసూల్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులను, పసిపాపను విచారించి నిం దితుడిపై ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసినట్లు ఎస్సై రామానాయక్‌ తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కంభం ప్రభుత్వ పౌరసరఫరాల గోడౌన్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు బాధితులు తెలిపారు. అత్యాచారయత్నానికి గురైన బాలికను వైద్యపరీక్షల నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement