సర్పంచ్‌ ఆత్మహత్య | Surpunch Anasurya Commits Suicide | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఆత్మహత్య

Apr 21 2018 12:58 PM | Updated on Nov 6 2018 8:16 PM

Surpunch Anasurya Commits Suicide - Sakshi

అనసూర్య (ఫైల్‌)

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి మండలం తుంబూరు సర్పంచ్‌ కర్లపూడి అనసూర్య(52) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ఎస్సై నరేష్‌బాబు తెలిపిన వివరాలు.. తుంబూరు గ్రామానికి చెందిన కర్లపూడి రామారావు, అనసూర్య ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్ధిక ఇబ్బందులు తోడర్యాయి. వీటిని తట్టుకోలేకపోయిన అనసూర్య, శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోసుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.

పురుగు మందు తాగి విద్యార్థి...
ఖమ్మంరూరల్‌: మండలంలోని ముత్తగూడెం శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి  పులకాని సాయి మహేష్‌రెడ్డి(17), పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయి మహేష్‌రెడ్డి, ఖమ్మంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 13న ఇంటర్‌ ఫలితాలు వచ్చాయి. ఇతడు నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 15న పురుగు మందు తాగాడు. ఆ తరువాత, తనకు తెలిసిన ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి, తాను పురుగు మందు తాగినట్టు, పొన్నెకల్‌ ఊరి బయట ఉన్నట్టు చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్లి ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. తండ్రి ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement