డెంగీతో విద్యార్థిని మృతి | Student Died With Dengue Fever In hyderabad | Sakshi
Sakshi News home page

డెంగీతో విద్యార్థిని మృతి

Sep 7 2018 9:00 AM | Updated on Nov 9 2018 4:36 PM

Student Died With Dengue Fever In hyderabad - Sakshi

సాయిని శ్రీలక్ష్మి (ఫైల్‌)

అంబర్‌పేట: డెంగీ వ్యాధితో బాధపడుతూ ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన అంబర్‌పేట పరిదిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ పటేల్‌నగర్‌కు చెందిన సాయిని సురేష్‌ కుమార్తె శ్రీలక్ష్మి(14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో స్థానికంగా ఉండే ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా సాధారణ జ్వరంగా భావించి మాత్రలు ఇచ్చాడు. బుధవారం రాత్రి ఆమెకు జ్వరం తీవ్రం కావడంతో విద్యానగర్‌లోని  ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు డెంగీ జ్వరం సోకిందని కార్పొరేటర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.  అమీర్‌పేటలోని కార్పొరేటర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బాలిక మృతికి  స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు మహేందర్‌ కారణమని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు అతని క్లినిక్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement