కాల్పుల కలకలం.. శివసేన నేత హత్య | Shiv Sena Leader Died In Gun Fire In Mumbai | Sakshi
Sakshi News home page

కాల్పుల కలకలం.. శివసేన నేత హత్య

Apr 23 2018 9:54 AM | Updated on Aug 21 2018 3:16 PM

Shiv Sena Leader Died In Gun Fire In Mumbai - Sakshi

హత్యకు గురైన సచిన్ సావంత్

సాక్షి, ముంబై: శివసేన పార్టీకి చెందిన నేతను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దండగులు జరిపిన కాల్పుల్లో శివసేన పార్టీకి చెందిన నేత సచిన్ సావంత్ మృతిచెందారు. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సావంత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతిచెందారని వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.

ముంబై శివార్లలోని కండివాలిలో శివసేన స్థానికశాఖ ఉపాధ్యక్షుడు సచిన్ సావంత్ ఆదివారం రాత్రి వెళ్లారు. అయితే దాదాపు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ బైకుపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సావంత్‌ను సమీపించారు. శివసేన నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ నేత ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారని కురార్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. సచిన్ సావంత్ హత్యపై పలువురు శివసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement