ఇంటి దొంగ పనే..! 

Police Solve Theft Case In Srikakulam District - Sakshi

అప్పులు తీర్చుకోవడానికి అక్రమ మార్గం ఎంచుకున్న ఉద్యోగి

పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ చోరీ కేసు ఛేదన 

క్యాషియరే దోపిడీకి ప్రధాన సూత్రధారి

శ్రీకాకుళం: చేసిన అప్పులు తీర్చలేక అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు రోడ్డులోగల శ్రీపద్మపూజిత ఆటో ఫైనాన్స్‌లో జరిగిన చోరీ ఇంటి దొంగ పనేనని పోలీసులు నిర్ధారించారు. గత నెల 28వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ మాట్లాడు తూ జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.38 లక్షల చోరీ కేసును సీఐ విజయానంద్‌ తన బృందంతో చాకచక్యంగా ఛేదించారని ప్రశంసించారు. గత నెల 28న అర్ధరాత్రి శ్రీ పద్మపూజిత ఆటో ఫైనాన్స్, నీలమణిదుర్గ ఆటో కన్సల్టెన్సీ లో చోరీ జరిగిందని సంస్థ ప్రతినిధి ఫణికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారన్నారు. ఈ క్రమంలో పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌లో పనిచేస్తున్న క్యాషియర్‌ మేనేడి సుబ్రహ్మణ్యం, విశాఖపట్నానికి చెందిన పాడి సంతోష్‌ అలియాస్‌ దువ్వాడ సంతోష్‌ అనే పాత నేరస్తుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు సీఐ విజయానంద్‌ బృందం దర్యాప్తులో గుర్తించారని తెలిపారు. సుబ్రహ్మణ్యంను విచారించడంతో అసలు విషయం బయటపడిందన్నారు. 

అప్పులు తీర్చేందుకు.. 
సుబ్రమణ్యం తన అప్పులు తీర్చుకునేందుకు పాత నేరస్తుడైన పాడి సంతోష్‌తోపాటు ఆనెపు ప్రసాద్, గనగళ్ల రా ము, సప్పిడి సంతోష్‌, చెరుకుల వెంకటమహేష్‌ అలియా స్‌ దుర్గ, తగరంపూడి సురేష్, మలిశెట్టి మోహన్‌కుమార్‌ అలియాస్‌ మోహన్‌లతో కలిసి పథకం ప్రకారం చోరీకి పా ల్పడ్డారని ఎస్పీ వివరించారు. చోరీ అనంతరం నిందితు లు ఒక కార్యాలయాన్ని ప్రారంభించి రూ.3 లక్షల విలువలైన ఫరీ్నచర్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. నిందితులను పట్టుకోవడంతోపాటు వారి నుంచి రూ.29.15 లక్షలను రికవరీ చేసినట్లు చెప్పారు. క్యాషియర్‌ సుబ్రహ్మణ్యం సెల్‌ఫోన్‌ ఆధారంగా విశాఖపట్నంలోని షీలానగర్‌ అయ్యప్ప నిలయంలో ఉంటున్న ఆనెపు ప్రసాద్‌ కోసం పోలీసులు గాలించారు.

అతని ఇంటిలో ప్రసాద్‌ను పట్టుకున్న పోలీ సులకు పద్మ పూజిత ఫైనాన్స్‌లో చోరీ అయిన హార్డ్‌డిస్క్‌ లభించింది. దీంతో చోరీకి పాల్పడిన మిగిలిన ఆరుగురిని పట్టుకోవడంతోపాటు మేనేడి సుబ్రహ్మణ్యం నుంచి రూ. 4.50 లక్షలు, పాడి సంతోష్‌ అలియాస్‌ దువ్వాడ సంతో ష్, గనగళ్ల రాము, సప్పిడి సంతోష్‌, చెరుకుల వెంకటమహేష్‌, తగరంపూడి సురేష్‌, మలిశెట్టి మోహన్‌ల నుంచి రూ. 21.15 లక్షల నగదును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అలాగే దువ్వాడ సంతోష్‌ నుంచి రూ.3 లక్షల విలువైన ఫరి్నచర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ విజయానంద్‌తోపాటు అతని బృందం సీఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐలు కె. కృష్ణారావు, వారణాసి వెంకట్‌లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్పీతోపాటు శ్రీకాకుళం సీఐ అంబేడ్కర్, సీసీఎస్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top