‘నగ్న’ ప్రయాణాన్ని అడ్డుకున్న పోలీసులు

Police Catched The Nacked Men Whom Wants To Travel Nakely On Flight - Sakshi

విమానంలో నగ్న ప్రయాణమే సౌకర్యంగా ఉంటుందని అనుకున్నాడో వింత ప్రయాణికుడు. అనుకున్నదే తడవుగా ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛాదన (బట్టలు) కూడా లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. మెల్లిగా చెక్‌ఇన్‌ అయ్యే ప్రాంతం వరకూ వెళ్లాడు. కానీ పోలీసుల కంటపడ్డాడు. అసహ్యమైన చర్యకు గాను పోలీసలు సదరు ప్రయాణికుడి వీపు విమానం మోత మోగించారు.  

మాస్కో: నగ్నంగా ప్రయాణించాలనే కోరికతో ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్టైన సంఘటన రష్యాలో జరిగింది. ‘శరీరంపై బట్టలు లేకుండా చేసే ప్రయాణం చాలా సుఖవంతం, సౌకర్యంగా ఉంటుంద’ని అరెస్ట్‌ అయిన ప్రయాణికుడు చెప్పడం విశేషం. ఆ ప్రయాణికుడిది రష్యాలోని యకుస్త్క్‌ ప్రాంతమని తెలుస్తోంది. అతడు మద్యం సేవించలేదని, పోలీసుల మందలింపు తర్వాత మానసిక చికిత్స కోసం ఆ ప్రయాణికుడ్ని విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చేర్పించామని రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. 

ఇటీవలే అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక సౌదీ ప్రయాణికురాలు తన బిడ్డను అక్కడి వెయిటింగ్‌ రూమ్‌లోనే మరిచిపోయి వెళ్లాల్సిన ఫ్లయిట్‌ ఎక్కేసింది. విషయాన్ని గుర్తించిన మహిళ లబోదిబోమంటూ విమానాన్ని వెనక్కి తిప్పాల్సిందిగా పైలట్‌ను ఇబ్బందికి గురిచేసింది. మహిళ మతిమరుపు కాస్తా అధికారుల చావుకొచ్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top