నీకిదే సరైన శిక్ష.. రోజంతా ఇక్కడే కూర్చో..!!

Mumbai Man Punished Under POCSO ACt To Sit Down One Day In Court Room - Sakshi

పోక్సో చట్టం కింద అతి తక్కువ శిక్ష

సాక్షి, ముంబై : పన్నెండేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ముంబై క్రిమినల్‌ కోర్టు అనూహ్యమైన శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద రూ.30 వేల జరిమానాతోపాటు రోజంతా కోర్టు రూమ్‌లోనే కూర్చోవాలని ఆదేశించింది. క్రిమినల్‌ కేసుల్లో అతి తక్కువ శిక్షాకాలం కలిగిన కేసుల్లో ఇదొకటి కావడం విశేషం. వివరాలు.. ఎదురింట్లో ఉండే బాలికతో అరవింద్‌ కబ్‌దేవ్‌ కామత్‌ (29) అనే వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. నగ్నంగా నిల్చుని కిటీకీలోనుంచి ఆమెకు సైగలు చేశాడు.

ఈ ఘటన 2015లో జరగగా గోవాదేవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన ముంబై న్యాయస్థానం .. ‘కోర్టు ఉదయించేవర​కు ఇక్కడే కూర్చో. వచ్చిపోయేవాళ్లంతా నీఘనకార్యం గురించి ముచ్చటించాలి’ అని వ్యాఖ్యానించింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం) లోని సెక్షన్‌ 12 కింద కామత్‌ను దోషిగా తేలుస్తూ.. ఒక రోజు ‘కోర్టు శిక్ష’,తో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top