బందరులో బాలికపై లైంగికదాడి! | Minor Girl Gets Pregnant By Own Cousin In Bandar | Sakshi
Sakshi News home page

బందరులో బాలికపై లైంగికదాడి!

Jul 11 2019 9:50 AM | Updated on Jul 11 2019 11:05 AM

Minor Girl Gets Pregnant By Own Cousin In Bandar  - Sakshi

సాక్షి, కోనేరు (మచిలీపట్నం): ఓ ప్రబుద్ధుడి కామవాంఛకు 13 సంవత్సరాల మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. వరుసకు అన్నయ్య అయినా కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్‌ బాలిక పై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, పోలీస్‌ అధికారులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది.

పోలీసుల కథ నం ప్రకారం.. మచిలీపట్నం టౌన్‌లోని ఓగీసుపేటకు చెందిన 13 ఏళ్ల మైనర్‌ బాలికకు వరుసకు అన్న అయిన మోహన్‌కుమార్‌ మాయమాటలు చెబుతూ కొంత కాలంగా ఆమెపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక బుధవారం నీరసంగా ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి బాలి కను నిలదీయగా అసలు విషయం చెప్పింది. తినుబండారాలు కొనిపెడానంటూ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు చెప్పింది. విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఐసీడీఎస్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు, అధికారులు ఓగీసుపేట చేరుకుని బాలిక నుంచి వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఐదు నెలల గర్భిణిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అఖిల్‌జమా తెలిపారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement