తప్పించుకు తిరుగుతూ దొరికాడు | Medak Police Arrested The Man Who Is Accused Of Non Bailable Warrant | Sakshi
Sakshi News home page

తప్పించుకు తిరుగుతూ దొరికాడు

Jul 8 2019 11:15 AM | Updated on Jul 8 2019 11:27 AM

Medak Police Arrested The Man Who Is Accused Of Non Bailable Warrant - Sakshi

బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో తల్వార్, నిందితుడు తిరుపతిని చూపిస్తున్న ఎస్‌ఐ అభిలాశ్‌

సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): పలు చోరీ కేసులలో నిందితుడిగా ఉండి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారి అయిన మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కొమ్మురాజుల తిరుపతి అనే యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ అభిలాశ్‌ తెలిపారు. అలాగే అతని వద్ద తపంచా, మహేంద్ర వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నాన్‌బెయిల్‌ వారెంట్స్‌ వచ్చిన  నిందితుడిని పట్టుకోవడానికి తగిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం మండలంలోని పోతారం క్రాస్‌ రోడ్డు వద్ద ఏఎస్‌ఐ హన్మంతారావు, కానిస్టేబుల్‌ నాగరాజు, మోహన్‌తో కలిసి వాహనాలు తనిఖీ చేశాం. నంబర్‌లేని మహేంద్ర వాహనంలో తిరుపతి పోతారం వైపు నుంచి వస్తుండగా అతడిని పట్టుకొని వాహనంలో లభించిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నాం. తిరుపతి పైన ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ చేశాం. పలు కేసుల్లో నిందుడైనందున తిరుపతి పైన రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసి ఆయన మహేంద్ర వాహనంతో పాటు అక్రమంగా కలిగిన ఉన్న తల్వార్‌లను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ అభిలాశ్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement