భర్త మందలించాడని.. పిల్లలతో సహా అదృశ్యం | Sakshi
Sakshi News home page

భర్త మందలించాడని.. పిల్లలతో సహా తల్లి అదృశ్యం

Published Thu, Jul 4 2019 11:55 AM

Married Woman Left Home With Children In Meerpet - Sakshi

మీర్‌పేట : భర్త మందలించాడని ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నేనావత్‌ శ్రీను నగరానికి వలసవచ్చారు. నందనవనం వాంబేకాలనీలో భార్య విజయ (35), పిల్లలు నిఖిల్‌ (16), వైశాలి (13), మహేష్‌లాల్‌ (11)లతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీను విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల విజయ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీను ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన విజయ ఈ నెల 2న ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన శ్రీను బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement