బాలికల పాఠశాలలో చొరబడి.. | Man Molested On Tenth Class Girl In Vijayawada | Sakshi
Sakshi News home page

బాలికల పాఠశాలలో చొరబడి..

Jul 25 2018 8:53 PM | Updated on Aug 25 2018 4:52 PM

Man Molested On Tenth Class Girl In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఓ బాలికల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తరగతి గదిలోకి దూరి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలికకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని బిషప్‌ అజరయ్య బాలికల పాఠశాలలోకి బుధవారం ఓ ఆగంతకుడు పదో తరగతి గదిలోకి అకస్మాత్తుగా దూరాడు. అనంతరం క్లాస్‌రూంలో ఉన్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయానికి గురైన ఆ బాలిక పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకింది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను వెంటనే దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement