కన్నతల్లిని, కూతురును కడతేర్చిన కసాయి

Man Killed His Mother And Daughter In Kadthal - Sakshi

కత్తితో కోసి, రోకలిబండతో కొట్టి దారుణం

ఆపై తల గోడకు బాదుకుని ఆత్మహత్యాయత్నం

కడ్తాల్‌(కల్వకుర్తి): నవ మాసాలు మోసి కనిపెంచి న తల్లితోపాటు, తన సొంత కూతురును కడతేర్చాడో ఓ వ్యక్తి. మద్యానికి బానిసై, ఉన్మాదిగా మారి ఇద్దర్నీ అతి దారుణంగా కత్తితో పొడిచి, రో కలిబండతో కొట్టి చంపిన సంఘటన కడ్తాల్‌ మం డల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బుధవారం రా త్రి జరగగా.. గురువారం సాయంత్రం వెలుగుచూసింది.

ఎస్‌హెచ్‌ఓ సుందరయ్య, స్థానికులు క థనం ప్రకారం.. బ్యాండు కొడుతూ జీవనం సాగిస్తున్న  కడ్తాల్‌ మండల కేంద్రానికి సిద్దిగారి నర్సింహకు ఆరేళ్ల క్రితం శంషాబాద్‌ మండలం మల్లాపూర్‌కు చెందిన స్వప్నతో వివాహం జరిగింది. కాగా నర్సింహ వేధింపులు భరించలేక మూడున్నర సం వత్సరాల క్రితం స్వప్న ఒంటిపై కిరోసిన్‌ పోసుకు ని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ కే సులో కొన్నాళ్లపాటు జైలులో ఉన్న నర్సింహ, ఏ డాది క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటికొచ్చినా నర్సింహ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగుతూ పనీపాటా లే కుండా జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తల్లి సి ద్దిగారి సుక్కమ్మ(65), కూతురు శ్రావ్య(5)లతో క లిసి ఇంట్లోనే నిద్రించాడు. తల్లి, కూతురు నిద్రలో కి జారుకున్నాక ఇంట్లో ఉన్న రోకలిబండతో తల్లి, కన్న కూతురిని రోకలి బండతో కొట్టి కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు.

అనంతరం ఇంటి గడి య పెట్టుకుని తలను గోడకు బాదుకోవడంతో పాటు, కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం సాయంత్రం ఇంటి గడప, తలుపు మీద రక్తపు మరకలు చూసిన స్థానికులు చూసి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికుల సహాయంతో పోలీసులు ఇంటి పైకప్పు పెంకులు తొలగించి ఇంట్లోకి వెళ్లి చూడగా సుక్కమ్మ, శ్రావ్యల మృతదేహలు పడి ఉన్నాయి. రక్తపు మడుగులో ఉన్న నర్సింహను అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం  మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top