మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం | Madhya Pradesh: Bus Falls Into River In Raisen | Sakshi
Sakshi News home page

Oct 3 2019 9:27 AM | Updated on Oct 3 2019 9:52 AM

Madhya Pradesh: Bus Falls Into River In Raisen - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, సుమారు 36మంది గాయపడ్డారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళతో సహా అయిదుగురు పురుషులు ఉన్నారు.  రైసేన్‌ నుంచి ఛత్తార్‌పూర్‌ వెళుతుండగా బస్సు  ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. నీట మునిగిన బస్సును వెలికి తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement