ప్రాణం తీసిన ప్రేమ | lover dead after 2days commit to suicide | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ప్రేమ

Oct 14 2017 12:43 PM | Updated on Oct 19 2017 9:11 PM

lover dead after 2days commit to suicide

సింధుతో రజనీకాంత్‌ (ఫైల్‌) చికిత్స పొందుతున్న ,తిరుపతి

మంథని: పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్‌(26) శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్‌ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బుధవారం నుంచి రజనీకాంత్‌ ఇంటిముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

మనస్తాపం చెందిన రజనీకాంత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. మంథని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్‌ తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న యువతి సింధుతోపాటు ఆమె అన్న తిరుపతి, తల్లి ఓదమ్మ, అత్త భాగ్య యువకుడి ఇంటిముందు ఉన్నారు. మరణవార్త తెలియగానే కోపోద్రిక్తులైన యువకుడి బంధువులు వారిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారని, తన మెడను కాళ్లతో తొక్కారని సింధు తెలిపింది. సింధు అన్న తిరుపతి తల, చేతులు, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. సింధు, ఆమె తల్లికి సైతం గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంథని ఎస్‌ఐ ఉపేందర్‌ గ్రామానికి వెళ్లి గాయపడ్డవారిని తమ వాహనంలో మంథని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement