న్యాయవాది నగ్న నిరసన | Lawyer Naked Protest In Front of Court in Tamil Nadu | Sakshi
Sakshi News home page

న్యాయవాది నగ్న నిరసన

Feb 1 2019 9:57 AM | Updated on Feb 1 2019 9:57 AM

Lawyer Naked Protest In Front of Court in Tamil Nadu - Sakshi

స్వామిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

అన్నానగర్‌: తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు భద్రత కల్పించాలని బుధవారం మదురై కోర్టు, కలెక్టర్‌ కార్యాలయాల్లో ఓ న్యాయవాది నగ్నంగా నిరసన తెలిపాడు. వివరాలు.. మదురై జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డు వద్ద ఓ వ్యక్తి దుస్తులను నగ్నంగా పరిగెత్తాడు. అక్కడున్న పోలీసులు అతన్ని నిలిపి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతను వారికి ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు స్వామి. అడ్వకేట్‌గా పనిచేస్తున్నా. వండియూర్‌ ప్రాంతంలోని ఓ క్లబ్‌లో గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు.

వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురు హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రాణాలకు అపాయం ఉంది. పోలీసులు తగిన భద్రత ఇవ్వాలని కోరాడు. ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత అడ్వకేట్‌ స్వామిని నగ్న పోరాటం చేయవద్దని హెచ్చరించి పంపారు. ఈ క్రమంలో స్వామి, పోలీసుస్టేషన్‌ నుంచి నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కూడా అతను మళ్లీ దుస్తులను విప్పి నగ్నంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ భద్రతలో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో అతను వండియూరులో అనుమతి లేని క్లబ్‌ను మూసివేయాలని కేకలు వేశాడు. పోలీసులు స్వామిని విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement