ఎయిర్‌పోర్టులో కేజీ బంగారం పట్టివేత  | KG grabbing gold at the airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో కేజీ బంగారం పట్టివేత 

Dec 14 2018 12:32 AM | Updated on Dec 14 2018 12:32 AM

KG grabbing gold at the airport - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం ఇద్దరు ప్రయాణికుల నుంచి డీఆర్‌ఐ అధికారులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో గురువారం తెల్లవారుజామున గువహటి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. వారి వద్ద వెండి పూతతో ఉన్న రెండు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement