వైఎస్సార్‌ సీపీ నేతపై హత్యాయత్నం, పొట్టి రవి అరెస్ట్‌ | JC Brothers supporter potti ravi arrested | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడి అరెస్ట్‌

Published Sat, Jul 6 2019 1:51 PM | Last Updated on Sat, Jul 6 2019 1:58 PM

JC Brothers supporter potti ravi arrested - Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్‌ కుమార్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న రవీంద్రా రెడ్డి అలియాస్‌ పొట్టి రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రవీంద్రారెడ్డిపై అనిల్‌కుమార్‌ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.

కాగా జేసీ వర్గీయులు పన్నిన హత్య కుట్ర నుంచి అనిల్‌ కుమార్‌ రెడ్డి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. గత నెలలో అనిల్‌ కుమార్‌ రెడ్డి తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వెళుతుండగా ఫాలో అయిన జేసీ వర్గీయులు.. ఆయన కారుని సుమోతో ఢీ కొట్టారు. అనంతరం వేటకొడవళ్ళతో నరికేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో బయటపడ్డ అనిల్ కుమార్ రెడ్డి టీడీపీ నేత చింతా నాగేశ్వర్‌రెడ్డితో సహా మరో పదిమంది జేసీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement