మోసం చేస్తావా అంటూ దేహశుద్ధి! | Hardware company fake owner arrested in cheating case | Sakshi
Sakshi News home page

మోసం చేస్తావా అంటూ దేహశుద్ధి!

Nov 29 2017 6:59 PM | Updated on Nov 29 2017 6:59 PM

సాక్షి, విజయవాడ: ఉద్యోగాలిస్తామంటూ వందలాది మందిని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివకోటిరెడ్డి అనే వ్యక్తి మడ్‌విక్‌ హార్డ్‌వేర్ సొల్యూషన్స్‌ పేరుతో ఓ సంస్థను నెలకొల్పాడు. ఉద్యోగం తన వద్దకు వచ్చిన సుమారు 140 మంది నుంచి రూ.25వేల చొప్పున వసూలు చేశాడు. ఉద్యోగం అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన బాధితులు బుధవారం శివకోటిరెడ్డిపై దాడికి దిగి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement