నట‘రాజకీయం’

Govt Taking Action On Teacher Who Ateempts To Molestation In Anantapur - Sakshi

కీచకోపాధ్యాయుడు నటరాజ్‌కు అధికారుల అండ

సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడినా చర్యల్లేవు

తాజాగా మరో పాఠశాలకు బదిలీ చేసిన ఆర్డీ

తప్పుపడుతున్న ఉపాధ్యాయినులు

సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : పట్టణంలోని ప్రకాశం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోని కీచకోపాధ్యాయుడు నటరాజ్‌పై చర్యలకు మున్సిపల్‌ ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారు. తోటి మహిళా ఉపాధ్యాయినులను, విద్యార్థినులను లైంగికంగా వేధించగా.. అతనిపై గత ఏడాది డిసెంబర్‌ 9న పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో కొన్నిరోజులు మెడికల్‌ లీవ్‌లో వెళ్లిపోయిన నటరాజ్‌.. ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన వ్యవహారంపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించగా.. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. వెంటనే నటరాజ్‌ను సస్పెండ్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్డీ) కేవలం బదిలీతో సరిపెట్టారు. బుధవారం అతన్ని మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వగా.. వెంటనే నటరాజ్‌ విధుల్లో చేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.  

నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి.. 
నటరాజ్‌కు అండగా నిలిచే క్రమంలో మున్సిపల్‌ ఆర్డీ అతన్ని పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు, అక్కడ హెచ్‌ఎంగా పనిచేస్తున్న మధుసూదనరాజును ప్రకాశం ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం నటరాజ్‌ తాను పనిచేస్తున్న ప్రకాశం ఉన్నత పాఠశాల బాధ్యతలు కొత్త హెచ్‌ఎంకు ఇచ్చి రిలీవ్‌ కావాల్సి ఉంది. ఇవేమీ పట్టించుకోని నటరాజ్‌ నేరుగా మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి మధుసూదన్‌రాజు బుధవారం సెలవుపై వెళ్లగా నటరాజ్‌ బుధవారం హడావుడిగా మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా బాధ్యతలు తీసుకోవడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. మధుసూదన్‌ రాజుకు ఇంత వరకు బదిలీ ఉత్తర్వులు కూడా అందలేదు.   

ఏకపక్షంగా బదిలీ 
మున్సిపల్‌ ఆర్డీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న మధుసూదనరాజు కుమారుడు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో అనంతపురంలోని మానసిక వికలాంగుల పాఠశాలలో చేరి్పంచారు. ఇక్కడే నివాసం ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ సమయంలో కూడా మొదటి ప్రాధాన్యత మధుసూదన్‌రాజుకే ఇవ్వడంతో ఆయన రోజు అనంతపురం నుంచి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన్ను 800 మందికి పైగా విద్యార్థులున్న ప్రకాశం పాఠశాలకు బదిలీ చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ హెచ్‌ఎంగా బాధ్యతలు నిరి్వహించాలంటే తాడిపత్రిలోనే నివాసం ఉండాలి. తన కుమారుని పరిస్థితి కారణంగా తాడిపత్రిలో నివాసం ఉండలేని స్థితిలో ఉన్న ఆయన ప్రకాశం పాఠశాల హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది.   

నటరాజ్‌ మాకొద్దు  
నటరాజ్‌ వ్యవహారం తెలుసుకున్న మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు..ఉపాధ్యాయినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడిని తమ పాఠశాలకు బదిలీ చేయడమేమిటని ప్రశి్నస్తున్నారు. 

కమిషనర్‌కు తెలియకుండా సరి్టఫికెట్‌ జారీ 
ఎస్సీ, ఎస్టీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటరాజ్‌ ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి పూచికత్తు అవసరం కాగా... పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున ఉపాధ్యాయుడు సూర్యనారాయణరెడ్డిని సంప్రదించి ఒప్పించాడు. అయితే పూచికత్తు ఇస్తున్న వ్యక్తి తన నెలసరి జీతం తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంది. ఆ సరి్టఫికేట్‌ను మామూలుగా డ్రాయింగ్‌ అధికారి(మున్సిపల్‌ కమిషనర్‌) ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న రాధాకృష్ణ శాలరీ సరి్టఫికేట్‌ను మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది.   

ఆర్డీ ఉత్తర్వుల మేరకే బదిలీ  
మున్సిపల్‌ ఆర్డీ ఆదేశాల మేరకు హెచ్‌ఎం నటరాజ్‌ను బదిలీ చేశాం. అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధుసూదన్‌రాజు ఇప్పటి వరకూ రిలీవ్‌ కాలేదు. 
– డి.చెన్నుడు, ఇన్‌చార్జి కమిషనర్, తాడిపత్రి 

కమిషనర్‌ అందుబాటులో లేక... 
శాలరీ సరి్టఫికెట్‌ మంజూరు చేసేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్‌ సిబ్బంది సూచన మేరకు సర్టిఫికేట్‌ మంజూరు చేయాల్సి వచ్చింది. 
– రాధాకృష్ట, హెచ్‌ఎం, మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top