
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ..
విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న షిర్డీ క్యాంటీన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కిచెన్‌లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా పొయ్యి నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో క్యాంటీన్‌లో ఉన్న సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న వారు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ పెద్దగాయాలు కాలేదు. మంటల వ్యాప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది.