
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా చించినాడ వద్ద గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి కూతురుతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన భార్యభర్తలు జడ్డు సూర్యగణేష్(33),పద్మ(28) కూతురు మౌనిక(5)లు 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. గోదావరి వద్ద గణేష్ వాహనం కనుగొన్నారు. గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారి కోసం గోదావరిలో పడవలతో గాలిస్తున్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.