వేకువజామున విషాదం | Elephant Attack on Man While Mornining Walk Karnataka | Sakshi
Sakshi News home page

వేకువజామున విషాదం

Dec 26 2019 11:57 AM | Updated on Dec 26 2019 11:57 AM

Elephant Attack on Man While Mornining Walk Karnataka - Sakshi

ఘటనాస్థలంలో గుమిగూడిన జనం చేతన్‌కుమార్‌(ఫైల్‌)

దొడ్డబళ్లాపురం: వాకింగ్‌ వెళ్లిన యువకుడిని ఏనుగు తొక్కి చంపివేసింది. ఈ ఘటన  కనకపుర తాలూకా నారాయణపుర గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.  టీ బేకుప్పె గ్రామానికి చెందిన చేతన్‌కుమార్‌(25) బుధవారం తెల్ల వారుజామున స్నేహితులతో కలిసి కోడిహళ్లి మెయిన్‌రోడ్డులో వాకింగ్‌కు వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు వాకింగ్‌ చేస్తూ వేగంగా వెళ్లగా చేతన్‌ వెనుకబడిపోయాడు. ఆ సమయంలో హఠాత్తుగా చెట్ల మధ్య నుండి వచ్చిన ఏనుగు చేతన్‌పై దాడిచేసి తొక్కి చంపింది. ఎంతసేపయినా చేతన్‌ రాకపోవడంతో మొబైల్‌కు కాల్‌ చేశారు. సమాధానం రాకపోవడంతో వెనక్కు వెళ్లి చూడగా చేతన్‌ మృతదేహం కనిపించింది. ఘటనాస్థలాన్ని అటవీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కనకపుర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement