
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు 4 కేజీల 658 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో తనిఖీలు చేయగా రూ. కోటి 43 లక్షల విలువైన బంగారం బయటపడింది. గ్యాస్ స్టౌలో బంగారం నింపి తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టురు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విజయవాడ డీఆర్ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.