మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌ | Delhi court allows ED to arrest P Chidambaram with option to interrogate him first | Sakshi
Sakshi News home page

మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్‌

Oct 15 2019 4:50 PM | Updated on Oct 15 2019 8:01 PM

Delhi court allows ED to arrest P Chidambaram with option to interrogate him first - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్‌ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్‌ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు.  ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయనున్నారు. తీహార్‌ జైల్లో ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈడీకి ఢిల్లీ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.

Advertisement
 
Advertisement
Advertisement