
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. చిలకానగర్ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని భూమికా రెడ్డి (8) మృతి చెందింది. భూమికా రెడ్డిని ఆమె తల్లి శోభారాణి ఈరోజు ఉదయం ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకుని వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో భూమికారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా శోభారాణికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.