పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్‌

Bride Groom Suicide Case: Father Suspect Foul Play in Son Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్‌ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్‌చారి చెప్పారు. సందీప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు జరిగిన ఫొటోషూట్‌కు వెళ్లిన తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్‌ హత్యకు బాబాయ్‌, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే కారణంగానే హత్య చేశారని ఆరోపించారు.

సందీప్‌ తల్లి చనిపోయిన నాటి నుంచి కుమారుడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్‌కు తనకు ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సందీప్‌ కోరినట్టుగానే పెళ్లి, రిసెప్షన్‌ జరిపిస్తానని కూడా  తాను చెప్పినట్టు వివరించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్‌లో సందీప్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(చదవండి: పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top