'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!

Bhuvanagiri Tribunal Orders To Return Back The Houses For Father Maintenance - Sakshi

సాక్షి, భువనగిరి: తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ ఓ తండ్రి భువనగిరి ఆర్డీఓ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఇరివురి వాదనలు విన్న అనంతరం తండ్రి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొడుకులకు తగిన బుద్ధి చెబుతూ తండ్రి కష్టపడి నిర్మించుకున్న మూడు ఇళ్లను తిరిగి ఇచ్చేయాలని ఆ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన బొడ్డు యాదగిరికి నలుగురు కుమారులు బొడ్డు నర్సింహులు, సుదర్శన్, ఉపేందర్, సత్యనారాయణలు ఉన్నారు. తాను సంపాదించి నిర్మించుకున్న ఇళ్లల్లో ఉంటూ తన కొ డులకు తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని, వృద్ధాప్య వయస్సులో ఉన్నా.. తన పోషణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించా రని తండ్రి యాదగిరి మే 24న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. యాదగిరి కేసు విచారణను స్వీకరించిన ట్రిబ్యునల్‌ చైర్మన్, భువనగిరి ఆర్డీఓ జి.వెంకటేశ్వర్లు అతడి కుమారులకు సమన్లు జారీ చేశారు.

జూలై 8న ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ఎదుట హాజరైన యాదగిరి కుమారులు తన తండ్రి పోషణకు ఒక్కొక్కరు రూ.2500 చొప్పున రూ.10వేలను ఇస్తామని పేర్కొన్నారు. దీనికి యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను తిరిగి ఇప్పించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఇరువురి వాదనలు విన్న ఆర్డీఓ గత నెల 23వ తేదిన తీర్పునిచ్చారు. రాజాపేట మండల కేంద్రం లోని 7–47, 7–41, 7–51 నంబర్లు గల ఇళ్లను ఖాళీ చేసి యాదగిరికి స్వాధీనం చేయాలని తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. అదే విధంగా యాదగిరికి తగిన రక్షణ కల్పించాలని సూచిస్తూ పోలీసులను ఆదేశిస్తూ ఈ నెల 8న ట్రిబ్యునల్‌ మరోమారు ఉత్తర్వులు ఇచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top