అల్లుడిని కడతేర్చిన అత్త | Aunt Killed Son In Law In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అల్లుడిని కడతేర్చిన అత్త

Jul 26 2018 12:15 PM | Updated on Jul 30 2018 8:41 PM

Aunt Killed Son In Law In Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో ఆగ్రహించిన అత్త అల్లుడిని హత్యచేసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ సంఘటన తూత్తుకుడి జిల్లా ఉడనకుడి సమీపాన ఇటీవల చోటుచేసుకుంది. తమిళ పత్రికల ద్వారా ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఉడనకుడి సమీపంలోని సిరునాడార్‌ ప్రాంతానికి చెందిన మహాసెల్వన్‌ (35). అదే ప్రాంతానికి చెందిన వికలాంగురాలు కవిత (33)ను ఏడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి జయశ్రీ (6), కవిన్‌రాజ్‌ (1) అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఈనెల 19వ తేదీ రాత్రి తన ఇంటి వాకిట్లో నిద్రించిన మహాసెల్వన్‌ తెల్లవారేసరికి హత్యకు గురై ఉన్నాడు. కులశేఖరన్‌ పట్టినం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసులు విచారణ జరపగా కింది వివరాలు వెల్లడయ్యాయి. మహాసెల్వన్‌ భార్య కవిత ముత్తుకిళి (45)అనే పిన్ని ఉన్నారు. ఆమెను భర్తను విడనాడి జీవిస్తోంది. సంఘటన జరిగిన రోజున మద్యం మత్తులో ఉన్న మహాసెల్వన్‌ ముత్తుకిళి (45)ని లైంగికంగా వేధించాడు. ఆమె నిరాకరించడంతో కొట్టి హింసించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇంటి వాకిట్లో నిద్రపోయాడు. ఆ సమయంలో ఆగ్రహించిన ముత్తుకిళి నిద్రిస్తున్న మహాసెల్వన్‌ గొంతును తాడు బిగించి హత్య చేసింది. ఇలావుండగా కులశేఖరన్‌ పట్టినం వీఏవో శరవణన్‌ సమక్షంలో ముత్తుకిళి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమె వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement