మెడకు చున్నీ చుట్టుకుని.. | Accidentally Child Death in Hyderabad | Sakshi
Sakshi News home page

మెడకు చున్నీ చుట్టుకుని..

Oct 30 2018 9:00 AM | Updated on Oct 30 2018 9:00 AM

Accidentally Child Death in Hyderabad - Sakshi

శృతిలయ మృతదేహం

బంజారాహిల్స్‌: ప్రమాదవశాత్తు మెడకు చున్నీ చుట్టుకుని చిన్నారి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, రాఘవరం కాపులవీధికి చెందిన రాజేశ్వరి జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 71లోని ఓ ఇంట్లో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు.

ఆమె కుమార్తె శృతిలయ ఫిలింనగర్‌లోని గీతాంజలి స్కూల్‌లో చదువుకుంటోంది. ప్రతిరోజూ శృతిలయ తన తల్లికి చెందిన చీర, చున్నీని చుట్టుకుని ఆడుకునేది. ఆదివారం రాత్రి కూడా చున్నీతో ఆడుకుంటుండగా మెడకు చుట్టుకొని ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. పనికి వెళ్లిన రాజేశ్వరి తిరిగి వచ్చి చూసేసరికి కుమార్తె ఉలుకుపలుకు లేకుండా పడి ఉండటంతో 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement