షీటీంలకు చిక్కిన 38మంది ఆకతాయిలు  | 39 Brats Under She Team | Sakshi
Sakshi News home page

షీటీంలకు చిక్కిన 38మంది ఆకతాయిలు 

Apr 2 2018 2:09 PM | Updated on Oct 17 2018 6:10 PM

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌): యువతులు, మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ కార్తికేయ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  గత నెల రోజుల వ్యవధిలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో షీ టీం బృందం 38 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో  ప్రసుత్తం ఆరు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, ఈ టీంలకు ఇన్‌చార్జీగా ఒక సీఐని నియమించామన్నారు.

ప్రతి షీ టీం బృందంలో ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో ఒక టీం పనిచేస్తోందన్నారు.ఈ టీం ప్రధానంగా స్త్రీలను వేధింపులు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ సాధరణ ప్రజలలో కలిసి పోయి, వీరివద్ద ఉండే నిఘా కెమెరాల ద్వారా ఆకతాయిల వేధింపులు రికార్డు చేసుకుంటారని, నేరస్వభావాన్ని బట్టి నేరస్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించటం లేదా, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గతనెల మార్చి 1 నుంచి 31 వరకు షీ బృందాలు 38 మందిని పట్టుకుని ఆయా పోలీస్‌స్టేషన్లలో అప్పగించారని సీపీ తెలిపారు. 
మహిళలూ సమాచారమివ్వండి..
మహిళలు ఎవరైనా ఆకతాయిల వేధింపులు నుంచి రక్షణ కోసం వాట్సప్‌ నం. 9490618029 లేదా, మేసేజ్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement