అన్నదమ్ములపై విచక్షణారహిత దాడి!

2 Brothers Accused Of Theft Tortured In Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరు అన్నదమ్ములను చితకబాదారు. దుస్తులు చించి.. వారిపై దాడికి తెగబడ్డారు. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్‌ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొడుతూ.. స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం దుస్తులు చించి... పెట్రోల్‌ పోశారు. 

ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడ్డ బాధితులు.. బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని.. ఆ తతంగాన్ని కెమెరాలో రికార్డు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

చదవండి: అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top