వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్‌

Zee Entertainment share price rises after Essel Group announces stake sale - Sakshi

సాక్షి, ముంబై:   ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో  దేశీయ అతిపెద్ద లిస్టెడ్‌ మీడియా కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో  ట్రేడర్ల  లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్‌ సెషన్‌ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు.

జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం  మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్‌ 77 మిలియన్‌ షేర్లను, క్వైతర్ గ్రూప్‌ 61 మిలియన్‌ షేర్లను, ఎస్సెల్‌ గ్రూప్‌ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్‌ సంస్థ డీల్స్‌కు బుక్‌ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్‌సీ గ్లోబల్‌ చైనా ఫండ్‌కు  2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది.

సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్‌ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్‌కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top