వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే | Walmart Pumps in Rs 763 crore in PhonePe | Sakshi
Sakshi News home page

వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే

Mar 23 2019 9:39 AM | Updated on Mar 23 2019 9:41 AM

Walmart Pumps in Rs 763 crore in PhonePe - Sakshi

ప్రపంచ ఆన్‌లైన​ దిగ్గజం వాల్‌మార్ట్‌.. పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌కు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మెజార్టీ వాటాను కొనేసిన వాల్‌మార్ట్‌ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌  సొంతమైన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేలో భారీ పెట్టుబడులను పెడుతోంది. సమీర్ నిగమ్ నేతృత్వంలోని కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, ప్రత్యేకించి రానున్న ఐపిఎల్ సీజన్లో ప్రకటనలు, ప్రమోషన్లపై  వెచ్చించాలని భావిస్తు‍న్న  సమయంలో తాజా నిధులు అందడం విశేషం. 

డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో రానున్న విప్లవాత్మక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాల్‌మార్ట్‌ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఫోన్‌ పేలో 763 కోట్ల రూపాయలు (సుమారుగా 111 మిలియన్ డాలర్లు)  సమకూర్చింది. 2019లో కంపెనీకి మొట్టమొదటి పెట్టుబడి నిధిగా భావిస్తున్నారు.  

బెంగళూరుకు చెందిన సమీర్‌ నిగమ్‌ స్థాపించిన మొబైల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్‌ 2016లో కొనుగోలు చేసింది. 2017లో 500మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చింది. దీంతో  డిజిటల్‌  చెల్లింపుల రంగంలో మార్కెట్‌ లీడర్‌గా దూసుకుపోతోంది.  50 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులతో, ప్రత్యర్థులకు ధీటుగా  దూసుకుపోతోంది.  పేటీఎం,  గూగుల్‌ పే, అమెజాన్‌ పే, వాట్సాప్‌ పేమెంట్స్‌, జియోతో పాటు కొత్తగా షావోమి ఎంఐ పే ఇటీవల డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి  ఎంట్రీ ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement