నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం | Vodafone, Idea may merge this month | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

Feb 20 2017 1:24 AM | Updated on Sep 5 2017 4:07 AM

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

నెలరోజుల్లో ఐడియా, వొడాఫోన్‌ విలీన ఒప్పందం

దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్‌ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, దేశీయ అగ్రగామి సెల్యులర్‌ కంపెనీ ఐడియాల మధ్య విలీన ఒప్పందం నెలలోపు ఖరారు కానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈ నెల 24–25 నాటికి ఈ రెండు సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన విలీన ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. డీల్‌పై సంతకాలకూ సిద్ధమైపోయాయి.

అయితే, విలీనంపై అటు వొడాఫోన్, ఇటు ఐడియాలు మాత్రం గోప్యతను పాటిస్తున్నాయి. వొడాఫోన్‌ మాత్రం ఈ విలీన బాధ్యతలను తన భారత విభాగానికి లోగడ చీఫ్‌గా వ్యవహరించిన మార్టిన్‌ పీటర్స్‌కు అప్పగించింది. వొడాఫోన్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విట్టోరియో కొలావో సైతం తన భారత విభాగంలోని అన్ని విభాగాల అధిపతులకు విలీనం గురించి వచ్చేవారం వివరించనున్నారు.

ప్రథమ స్థానానికి: ఇండియా రేటింగ్స్‌
ఈ డీల్‌ సాకారమైతే రెండు సంస్థల విలీనం ద్వారా ఏర్పడే సంస్థ దేశీ టెలికం రంగంలో... 40% వాటాతో, 38 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కోగా నిలుస్తుందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. అలాగే, ఆదాయం రూ.77,500 – 80,000 కోట్ల స్థాయిలో ఉండనుంది. ఇక స్పెక్ట్రమ్, మౌలిక వసతులపై ఇరు సంస్థలు వేర్వేరుగా భారీగా వ్యయం చేయాల్సిన అవసరం కూడా తప్పుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement