నేడు, రేపు మార్కెట్లకు సెలవు | stock markets declared today, tommorow holiday | Sakshi
Sakshi News home page

నేడు, రేపు మార్కెట్లకు సెలవు

Apr 14 2016 10:50 AM | Updated on Nov 9 2018 5:30 PM

నేడు, రేపు మార్కెట్లకు సెలవు - Sakshi

నేడు, రేపు మార్కెట్లకు సెలవు

మూడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు నేడు, రేపు సెలవు దినాలుగా ప్రకటించాయి.

ముంబై : మూడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు నేడు, రేపు సెలవు దినాలుగా ప్రకటించాయి. నేడు(గురువారం) అంబేద్కర్ జయంతి, రేపు(శుక్రవారం) శ్రీరామనవమి పండుగ సందర్భంగా మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. ఈ వారమంతా మార్కెట్లో సానుకూల పవనాలే వీచడంతో, బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో నడిచాయి.

ఈ ఏడాది రుతుపవనాలు మంచిగా ఉంటాయని సంకేతాలు రావడంతో పాటు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్థికవ్యవస్థకు శుభసూచికగా విడుదలు కావడంతో, మార్కెట్ ట్రెండ్ ను లాభాల బాటలో నడిపించాయి. అదేవిధంగా చైనా ఎగుమతులు కూడా 10 శాతం పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటలో నడవడం, మార్కెట్లో షేర్లకు శుభతరుణంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement