ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌

Sensex snaps 6-day winning run to end 129 points lower - Sakshi

బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ 

సెన్సెక్స్‌ 129 పాయింట్లు డౌన్‌ 

32 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ఆరు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ కారణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌ పతనమైంది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, మన దగ్గర కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ తదితర బ్లూ చిప్‌ షేర్లు పెరగడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్‌ కీలకమైన 34,000 పాయింట్లపైన నిలదొక్కుకోలేకపోయినా, నిఫ్టీ మాత్రం 10,000 పాయింట్లపైననే ముగిసింది.

రోజంతా 599 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 129 పాయింట్ల పతనమై 33,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కార ణంగా సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలన్న పిటీషన్‌పై ఆర్థిక శాఖ వివరణను సుప్రీం కోర్టు కోరింది. దీంతో బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్, ఆర్థిక రంగ, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు నష్టపోయాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు, యూరప్‌ మార్కెట్లు  కూడా నష్టాల్లో ముగిశాయి.  

►  ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌ 5% నష్టంతో రూ.1,633 వద్ద ముగిసింది.  
► రైట్స్‌ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్‌ షేర్‌ 2.4% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని(10.68 లక్షల కోట్లు) దాటింది.  
► అమెజాన్‌ సంస్థ 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 4% లాభంతో రూ. 573వద్ద ముగిసింది.  
► హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 2 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల ఈక్విటీ షేర్లను  ఇంగ్లాండ్‌కు చెందిన స్డాండర్డ్‌ లైఫ్‌ రూ.1,985 కోట్లకు బహిరంగ మా ర్కెట్‌ లావాదేవీల్లో విక్రయించింది. బీఎస్‌ఈలో ఈ షేరు 3.2% లాభంతో రూ.518 వద్ద ముగిసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-08-2020
Aug 05, 2020, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 5 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 5,01,025 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,...
05-08-2020
Aug 05, 2020, 04:56 IST
వీఆర్‌పురం, (రంపచోడవరం)/సాక్షి అమరావతి:  సీపీఎం నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా బారినపడి కన్నుమూశారు. కోవిడ్‌...
05-08-2020
Aug 05, 2020, 04:54 IST
సాక్షి, హైదరాబాద్ ‌: ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌...
05-08-2020
Aug 05, 2020, 04:37 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం...
04-08-2020
Aug 04, 2020, 21:09 IST
న్యూఢిల్లీ: మనుషుల్లో పేద, ధనిక, కుల, మత బేధాలు ఉంటాయి కానీ కరోనాకు మాత్రం అందరూ సమానమే. సామాన్యుల నుంచి...
04-08-2020
Aug 04, 2020, 20:32 IST
బుల్లితెర నుంచి వెండి తెర మీద‌కు పాకిన క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖులు ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఈ బాధితుల లిస్టులో...
04-08-2020
Aug 04, 2020, 20:23 IST
హైదరాబాద్‌: గతంలో కరోనా కన్నా భయంకరమైన వైరస్‌లు ఎన్నో వచ్చాయి కానీ.. ఇంత నష్టం జరగలేదన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి...
04-08-2020
Aug 04, 2020, 20:21 IST
కొత్తగా 6,953 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,625 కి...
04-08-2020
Aug 04, 2020, 15:56 IST
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి అతి చవకైన ఔషధాన్నిలాంచ్ చేసింది. దేశంలో రోజుకు 50వేల కోవిడ్-19...
04-08-2020
Aug 04, 2020, 14:32 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే...
04-08-2020
Aug 04, 2020, 13:33 IST
సాక్షి, ఢిల్లీ : చైనాలో కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు గురించి ముందుగానే అధికారులను హెచ్చరించడంతో పాటు కరోనా సోకిన అనేక...
04-08-2020
Aug 04, 2020, 12:36 IST
న్యూఢిల్లీ: మహమ్మారి క‌రోనా వ్యాపించిన తొలి నాళ్లలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసుల నమోదైన దేశ రాజధానిలో వైరస్‌ తీవ్రత...
04-08-2020
Aug 04, 2020, 11:35 IST
సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు...
04-08-2020
Aug 04, 2020, 10:47 IST
కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్‌–19 పోషించే విలన్‌ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.....
04-08-2020
Aug 04, 2020, 10:18 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా వైరస్‌కు  సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.  భారత్ లో...
04-08-2020
Aug 04, 2020, 09:38 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24గంటల్లో 13,787 శాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 1286 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర...
04-08-2020
Aug 04, 2020, 09:37 IST
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి  నివాసంలో కరోనా వైరస్ కలకలం  రేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్  కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు...
04-08-2020
Aug 04, 2020, 09:31 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక...
04-08-2020
Aug 04, 2020, 09:08 IST
సాక్షి, హైదరాబాద్ ‌: బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో...
04-08-2020
Aug 04, 2020, 09:08 IST
నెల్లూరు(అర్బన్‌): కోవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మా దానం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుకు స్పందించిన ఓ డాక్టర్‌ ప్లాస్మా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top