ప్రారంభ లాభాలు ఆవిరి, ఫ్లాట్‌గా  సూచీలు

Sensex Rises Over 200 Points, agains turns Flat - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆర్బీఐ వడ్డీరేటు కోత అంచనాలతో ఆరంభంలోనే 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ అనంతరం  స్వల్ప లాభాలకు పరిమితమై కొనసాగుతోంది. 49 పాయింట్ల లాభంతో 38711 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల స్వల్ప లాభంతో11489 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఆయిల్‌ రంగ షేర్లుమాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టాటా స్టీల్‌,కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌; గ్రాసిం, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ నష్టపోతుండగా బీపీసీఎల్‌, ఐవోసీ, యస్‌బ్యాంకు, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌ లాభపడుతున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top