దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

Sensex Jumps Over 2000 Points As Pharma Financial Stocks Lead Gains - Sakshi

 దలాల్ స్ట్రీట్ లో దివాలీ

సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి.  అంతర్జాతీయ సంకేతాలతో ఆరంభంలోనే 1300పాయింట్లకు పైగా లాభపడింది. అనంతరం  మరింత ఎగిసిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించి  జోష్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 584 పాయింట్లు లాభపడింది. తద్వారా  సెన్సెక్స్ మళ్లీ  29 వేల స్థాయిని, నిఫ్టీ 8600 స్థాయిని సునాయాసంగా అధిగమించాయి. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ  మిడ్ క్యాప్,   స్మాల్  క్యాప్ ఇండెక్సులు కూడా  లాభాలతో కళ కళలాడుతున్నాయి.  

ప్రస్తుతం సెన్సెక్స్ 2045 పాయింట్లు ఎగిసి 29637 వద్ద, నిఫ్టీ 588 పాయింట్ల లాభంతో 8672 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఫార్మ, ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.  ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్స్‌గా   ఉన్నాయి.  ఇంకా మారుతి 13 శాతం. అల్ట్రాటెక్ సిమెంట్ పది శాతం ఎగిసింది.  బజాజ్ ఫిన్‌ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టపోతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top