భారీగా పుంజుకున్న రూపాయి  | Sakshi
Sakshi News home page

భారీగా పుంజుకున్న రూపాయి 

Published Fri, Nov 2 2018 1:37 PM

The rupee appreciated 64 paise to 72.72  - Sakshi

సాక్షి, ముంబై: ఇటీవల వరుసగా చారిత్రక గరిష్టాలను నమోదు చేస్తూ వచ్చిన దేశీయ కరెన్సీ  రూపాయి విలువ క్రమేపీ పుంజుకుంటోంది.  శుక్రవారం  ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న రూపాయి  మరింత బలపడింది. డాలరు మారకంలో  రూపాయి ఏకగా 62 పైసలు పుంజుకుని 73స్థాయినుంచి పైకి ఎగిసింది.  ప్రస్తుతం 72.72వద్ద స్తిరంగా కొనసాగుతోంది.   గురువారం  50 పైసలు ఎగిసి 73.45వద్ద ముగిసింది. 

మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. బ్రెంట్‌  క్రూడ్‌ ధర  బ్యారెల్‌కు 73 డాలర్లు కు చేరింది.  గత అయిదు సెషన్లుగా క్షీణిస్తూ వస్తున్న   ఇంధన ధరలు శుక్రవారం 6శాతం పతనమయ్యాయి.   దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా   4 శాతానికిపైగా  ఎగిసాయి. ఈ వారం  10సంవత‍్సరాల  బ్యాండ్‌ మార్కెట్‌  ఈల్డ్స్‌ 7.8 శాతానికి  తగ్గాయి. గత నెలలో ఇది  8 శాతంగా ఉంది. 

Advertisement
Advertisement