జియో మళ్లీ 3 నెలల ఆఫర్‌! | Reliance Jio revamps its prepaid-postpaid plans, adds two new plans to the mix | Sakshi
Sakshi News home page

జియో మళ్లీ 3 నెలల ఆఫర్‌!

Jul 12 2017 12:33 AM | Updated on Sep 5 2017 3:47 PM

జియో మళ్లీ 3 నెలల ఆఫర్‌!

జియో మళ్లీ 3 నెలల ఆఫర్‌!

ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌ ముగింపు దగ్గర పడుతుండటంతో ‘రిలయన్స్‌ జియో’ తాజాగా రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది.

రూ.399తో 84 రోజులు అన్‌లిమిటెడ్‌
రూ.349కి 56 రోజులు.. పరిమిత డేటా
పోస్ట్‌ పెయిడ్‌కూ ఆకర్షణీయ ప్లాన్లు  


న్యూఢిల్లీ: ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌ ముగింపు దగ్గర పడుతుండటంతో ‘రిలయన్స్‌ జియో’ తాజాగా  రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది. అలాగే ప్రస్తుతమున్న ప్లాన్స్‌లో కొన్ని మార్పులు చేసింది. జియో రూ.19 నుంచి రూ.9,999 వరకు వివిధ ప్లాన్స్‌ను అందిస్తోంది.

సంస్థ వెబ్‌సైట్‌ ప్రకారం.. కొత్త ప్లాన్స్‌ ఇవీ...
ప్రిపెయిడ్‌: రూ.349, రూ.399 ధరల్లో ప్రైమ్‌ సభ్యుల కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్స్‌ను ఆవిష్కరించింది. రూ.349 ప్యాక్‌లో 20 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. వాలిడిటీ 56 రోజులు. డేటాపై  పరిమితి లేదు. 20 జీబీ అయిపోయాక స్పీడ్‌ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ.399 ప్యాక్‌లో 84 జీబీ డేటాను 84 రోజులు పొందొచ్చు. రోజుకు 1 జీబీ 4జీ డేటా పరిమితి ఉంది. ఇది అయిపోయిన తర్వాత స్పీడ్‌ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

పోస్ట్‌పెయిడ్‌: రూ.349, రూ.399 ధరల్లో పోస్ట్‌పెయిడ్‌ ప్యాక్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వాలిడిటీ వరుసగా 2, 3 నెలలు. రూ.349 ప్యాక్‌లో 20 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. డేటాపై ఎలాంటి పరిమితి లేదు. 20 జీబీ అయిపోయాక స్పీడ్‌ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ.399 ప్యాక్‌లో 90 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 1 జీబీ 4జీ డేటా పరిమితి ఉంది. ఆ తర్వాత స్పీడ్‌ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.   

సవరించిన ప్యాక్స్‌ ఇవీ..
రూ.309, రూ.509 ప్యాక్‌లను సవరించింది. ఈ ప్లాన్స్‌లో ప్రిపెయిడ్‌ యూజర్లు వరుసగా రోజుకు 1 జీబీ, 2 జీబీ 4జీ డేటాను 56 రోజుల వరకు పొందొచ్చు. 4జీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్‌ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇదివరకు ఈ ప్యాక్స్‌ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అదే పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు ప్యాక్స్‌ వాలిడిటీ 2 నెలలుగా ఉంది. వీరికి వాలిడిటీ ఇదివరకు నెల రోజులు.

ప్రీమియం ప్లాన్స్‌లో మార్పులు...
రూ.999 ప్లాన్‌లో 60 జీబీ కాకుండా 90 జీబీ 4జీ డేటాను 90 రోజులుపాటు పొందొచ్చు.
రూ.1,999 ప్యాక్‌ వాలిడిటీ 120 రోజులుగా ఉంది. ఇందులో 125 జీబీ కాకుండా 155 జీబీ 4జీ డేటా వస్తుంది.
రూ.4,999 ప్లాన్‌లో ఇకపై 380 జీబీ 4జీ డేటా పొందొచ్చు. దీని వాలిడిటీ 210 రోజులు.
రూ.9,999 ప్యాక్‌లో 780 జీబీ 4జీ డేటా పొందొచ్చు. దీని వాలిడిటీ 390 రోజులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement