ఏషియన్‌ పెయింట్స్‌లో రిలయన్స్‌ వాటాల విక్రయం?

Reliance Industries to sell its Asian Paints stake worth Rs 7490 crs - Sakshi

రుణభారాన్ని తగ్గించుకునేందుకే

విలువ సుమారు రూ. 7,490 కోట్లు

న్యూఢిల్లీ:  రుణభారాన్ని మరింతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా దేశీ పెయింట్స్‌ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యోచిస్తోంది. గురువారం ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ముగింపు ధర రూ. 1,594ను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ వాటాల విలువ సుమారు 989 మిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ. 7,490 కోట్లు) ఉంటుంది. ఇప్పటికే వాటాల విక్రయానికి సంబంధించి బ్యాంకులతో రిలయన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్‌ డీల్స్‌ ద్వారా విడతల వారీగా ఈ వాటాలను అమ్మాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తీస్తా రిటైల్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా ఏషియన్‌ పెయింట్స్‌లో రిలయన్స్‌కు వాటాలు ఉన్నాయి. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలని కంపెనీ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top