పేటీఎం మాల్‌ 2017 గ్రాండ్‌ ఫైనల్‌ సేల్‌ | Paytm Mall 2017 Grand Finale Sale Has Discounts, Cashbacks  | Sakshi
Sakshi News home page

పేటీఎం మాల్‌ 2017 గ్రాండ్‌ ఫైనల్‌ సేల్‌

Dec 13 2017 4:40 PM | Updated on Dec 13 2017 8:31 PM

Paytm Mall 2017 Grand Finale Sale Has Discounts, Cashbacks  - Sakshi

12.12 సేల్‌ అనంతరం ఒక్క రోజులోనే పేటీఎం 2017 గ్రాండ్‌ ఫైనల్‌ సేల్‌ను ప్రారంభించింది. పేటీఎం మాల్‌లో నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, డిసెంబర్‌ 15 వరకు నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఆపిల్‌, లెనోవో, మోటోరోలా, శాంసంగ్‌, షావోమి లాంటి అన్ని దిగ్గజ బ్రాండులపై పేటీఎం మాల్‌ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అదేవిధంగా రూ.64వేలుగా ఉన్న ఐఫోన్‌ 8(64జీబీ) వేరియంట్‌ను రూ.58,582కే లిస్టు చేసింది. ''MOB7500'' ప్రోమో కోడ్‌ను వాడుతూ ఐఫోన్‌ 8పై రూ.7500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఐఫోన్‌ 7(32జీబీ వేరియంట్‌) రూ.44,599కే అందుబాటులోకి వచ్చింది. రూ.6,250 క్యాష్‌బ్యాక్‌తో ఐఫోన్‌ 7 ధరను మరింత రూ.38,349కి తగ్గించింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌పై కూడా పేటీఎం మాల్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.48,900గా ఉన్న గెలాక్సీ ఎస్‌7ను రూ.32,750కే అందుబాటులోకి తెచ్చింది. వివో వీ7 ప్లస్‌ను డిస్కౌంట్‌ ధరలో రూ.21,990కే విక్రయిస్తోంది. ఇలా లెనోవో కే8(32జీబీ మోడల్‌) కూడా పేటీఎం మాల్‌ సేల్‌లో రూ.10,356తో లిస్టు అయింది. ''MOB12'' ప్రోమో కోడ్‌తో రూ.1,243 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఓప్పో ఏ71 స్మార్ట్‌ఫోన్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో 11,800కే అందుబాటులోకి వచ్చింది. ఇలా మోటో జీ5ఎస్‌, స్వైప్‌ కనెక్ట్‌ పవర్‌ 4జీ, స్వైప్‌ ఎలైట్‌ ప్రో 32జీబీ, స్వైప్‌ ఎలైట్‌ 2ప్లస్‌, మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ 6, ఇంటెక్స్‌ ఆక్వా ఎస్‌3 4జీ స్మార్ట్‌ఫోన్లపై పలు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం మాల్‌ అందిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement