కోల్గేట్ మార్కెట్ వాటాకు రాందేవ్ బాబా గండి! | patanjali ayurveda enters toothpaste market | Sakshi
Sakshi News home page

కోల్గేట్ మార్కెట్ వాటాకు రాందేవ్ బాబా గండి!

Jan 29 2016 3:54 PM | Updated on Sep 3 2017 4:34 PM

కోల్గేట్ మార్కెట్ వాటాకు రాందేవ్ బాబా గండి!

కోల్గేట్ మార్కెట్ వాటాకు రాందేవ్ బాబా గండి!

నిన్న కాక మొన్న నూడుల్స్ మార్కెట్‌లో ప్రవేశించి ఆటా నూడుల్స్‌తో నెస్లే కంపెనీకి గండికొట్టిన రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద.. ఇప్పుడు టూత్‌పేస్ట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది.

నిన్న కాక మొన్న నూడుల్స్ మార్కెట్‌లో ప్రవేశించి ఆటా నూడుల్స్‌తో నెస్లే కంపెనీకి గండికొట్టిన రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద.. ఇప్పుడు టూత్‌పేస్ట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్లూ ఈ రంగంలో రారాజుగా ఉన్న కోల్గేట్ పామోలివ్ వాటాకు గండికొడుతోంది. ఇప్పటికే టూత్‌పేస్ట్ మార్కెట్‌లో 4.5 శాతం వాటాను పతంజలి ఆయుర్వేద చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో కోల్గేట్ సంస్థ తన మార్కెట్‌ను గణనీయంగా కోల్పోయింది.

'దంత కాంతి' పేరుతో ఆయుర్వేద టూత్‌పేస్టును పతంజలి ఆయుర్వేద విడుదల చేసింది. అందులో మెడికేటెడ్, అడ్వాన్స్‌డ్, జూనియర్ అనే మూడు రకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇక త్వరలోనే ఫుడ్ డ్రింకులు, బేబీ కేర్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టి.. ఆ రంగాల్లో ఉన్న బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యానికి గండికొట్టాలని పతంజలి ఆయుర్వేద భావిస్తోంది. ఇన్నాళ్లూ బేబీ కేర్ రంగంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement